'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

KKD: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిఠాపురం పట్టణ ఎస్సై మణికుమార్ తెలిపారు. పిఠాపురం ప్రభుత్వ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ క్రైమ్ మహిళల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి పాస్‌వర్డ్, ఓటీపీ అడిగినా చెప్పొద్దని సూచించారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు.