VIDEO: తడ్కల్‌లో రేణుక ఎల్లమ్మ బోనాలు

MDK: కంగ్టి మండల తడ్కల్‌లో రేణుక ఎల్లమ్మ అమ్మవారికి భారీ ఎత్తున మహిళలు బోనాల తీశారు. బుధవారం బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, హారతి తదితర పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ బోనాల పండుగకు గ్రామ ప్రజలు తమ పిల్లపాపలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించిన శోభయాత్రలో డప్పు వాయిద్యాలు హోరు నిర్వహించారు.