స్ఫూర్తికి నగదు ప్రోత్సాహం అందజేసిన సీతక్క

MLG: జిల్లాలో బండారుపల్లి మోడల్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థిని స్ఫూర్తికి మంత్రి సీతక్క రూ.10,000 నగదు ప్రోత్సాహం అందజేశారు. 2023-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో 970 మార్కులు సాధించినందుకు గాను ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నట్లు ప్రిన్సిపల్ దేవకి తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిని అభినందించారు.