'పత్తి కొనుగోళ్లపై తేమ నిబంధనలు ఎత్తివేయాలి'
KMM: వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగినందున, కొనుగోళ్లపై ఉన్న నిబంధనలను ఎత్తివేసి, పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం నరసింహపురంలో నాయకులు దివ్వెల వీరయ్య, ప్రభాకరరావు పత్తి రైతుల ఇళ్లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.