'వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలి'
MHBD: గెలిచిన 15 రోజుల్లో అంబేద్కర్ నగర మహిళల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చిన ఆరో వార్డు కౌన్సిలర్ తక్షణమే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం అంబేద్కర్ నగర్ కాలనీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడమే కాదు ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల మనసులు గెలుచుకోవాలన్నారు.