దివ్యాంగులకు పెట్రోలుపై రాయితీ

NLR: దివ్యాంగుల వాహనాలకు పెట్రోలు కొనుగోలుపై రాయితీ అందించనున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ మహమ్మద్ అయూబ్ శనివారం తెలిపారు. మూడు చక్రాల వాహనాలు కలిగిన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, వాహనం ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పెట్రోలు బిల్లులు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్, ఫొటోలతో నెల్లూరులోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.