అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

MDK: రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. స్థానిక సీఐ వెంకటరాజ గౌడ్ చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి నుండి ఈనెల 21వ తేదీ వరకు వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు.