VIDEO: రోడ్ల పైన ధాన్యం కుప్పలు.. వాహనదారులు ఇబ్బందులు
JGL: రైతులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ధాన్యాన్ని ఆరబోస్తూ రాత్రివేళ కుప్పగా చేస్తుండడంతో కుప్పలు గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ - ధర్మారం మధ్యలో రోడ్డుపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఆ రహదారిలో ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. అంతేకాకుండా మలుపుల వద్ద కూడా ధాన్యం పోయడంతో రోడ్డు ఇరుకుగా మారింది.