VIDEO: విద్యుత్ కాంతుల్లో జిగేల్ మంటున్న వల్మిడి క్షేత్రం
JN: రెండో భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి మండలం వల్మిడిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ వెలుగులతో కళకళలాడుతోంది. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన రాజగోపురం, గర్భగుడి, రామలింగేశ్వర స్వామి ఆలయం సహా మొత్తం ప్రాంగణం రంగురంగుల దీపాలతో భక్తులను ఆకట్టుకుంటోంది.