తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

NZB: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పోతంగల్​ మండల కేంద్రంలోని వివిధ కాలనీల నిరసన తెలిపారు. గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.