'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
AKP: వైద్య ఆరోగ్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కోటవురట్ల మండలం తంగేడులో హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పనితీరుపై ఆరా తీశారు. సమయపాలన పాటించాలని వారికి సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.