'ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించాలి'
NRPT: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఊట్కూర్ మండలంలో ఘనంగా నిర్వహించాలని మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో పార్టీ జెండాను ఆవిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వేడుకల లక్ష్యమన్నారు. పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.