అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే బాలునాయక్

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే బాలునాయక్

NLG: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. 'మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా గురువారం తూర్పుపల్లి గ్రామంలో పర్యటించి మాట్లాడారు. పలు కాలనీలలో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించారు.