గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
KKD: సామర్లకోటలోని రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో సామర్లకోట, వేట్లపాలెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్లాంట్‌లో భారీ నష్టం జరిగినట్లు సమాచారం.