'నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఇవాళ CPI పార్టీ మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశాన్ని జిల్లా కార్యదర్శి బిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లేష్ పాల్గొన్నారు.