VIDEO: హెచ్ఎం బషీర్ తీరుపై విద్యార్థులు ఆగ్రహం
ATP: గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామం వద్ద అయ్యప్పనగన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రధానోపాధ్యాయులు బషీర్ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులు హెచ్ఎంను నిలదీసినా, ఆయన తీరు మారకపోగా వారిని దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.