VIDEO: భూ కబ్జాను అడ్డుకున్న కుటుంబంపై దాడి

VIDEO: భూ కబ్జాను అడ్డుకున్న కుటుంబంపై దాడి

అన్నమయ్య: గుర్రంకొండ తళారోళ్లపల్లెలో భూ కబ్జాను అడ్డుకున్న సిద్ధారెడ్డి కుటుంబంపై ప్రత్యర్థులు మంగళవారం రాత్రి కర్రలతో దాడి చేశారు. రామచంద్రారెడ్డి తన వాటాతో పాటు సిద్ధారెడ్డికి చెందిన 3.5 ఎకరాలను దామోదర్ అనే వ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.