ఈనెల 6న ఏఐబీఈ మోడల్ పరీక్ష

ఈనెల 6న ఏఐబీఈ మోడల్ పరీక్ష

కర్నూలు: భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. కర్నూలులోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగనాథ్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికాంత్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.