సీఎం జగన్ గెలుపు కోసం వాలంటీర్లు రాజీనామా

ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే 7 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కు తన కార్యాలయంలో శనివారం రాజీనామా లేఖను అందజేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో సీఎం గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వారు పేర్కొన్నారు.