పుత్తూరు మున్సిపల్ కమిషనర్ బదిలీ
TPT: పుత్తూరు పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ శానిటరీ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావును కమిషనర్‌గా నియమించారు.