VIDEO: ఉప్పల్ స్టేడియం వద్ద స్వల్ప ట్రాఫిక్ జామ్
MDCL: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో భారీగా ప్రేక్షకులు, ప్రయాణికులు తరలివచ్చారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో కాస్త ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.