వరి కొయ్యలు కాల్చవద్దు: జిల్లా వ్యవసాయ అధికారి
MDK: చిన్నశంకరంపేట మండలంలోని అంబాజిపేటలో పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ పరిశీలించారు. పంట పోలాల్లో వరి కొయ్యలు కాల్చవద్దని సూచించారు. వరి కొయ్యలు పంటపొలంలో దున్నడం ద్వారా ఎరువుగా మారనుందని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలు కూడిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏవో ప్రవీణ్ కుమార్, ఏఈవో మధులిక ఉన్నారు.