శవ రాజకీయాలు చేయడం మానుకోండి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

MBNR: మాజీ మంత్రి కేటీఆర్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మండిపడ్డారు. శనివారం మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతి పై కేటీఆర్, హరీష్ రావు, గువ్వల బాలరాజు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.