VIDEO: బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ఏకాంతోత్సవం
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.