ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం

ఖమ్మం: జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఉదయం నుంచి క్రయవిక్రయాలు పునఃప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం నేడు మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా రైతాంగం గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.