ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫారం
ADB: బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర విద్యుత్ ట్రాన్స్‌ఫారం ప్రమాదకరంగా ఉంది. దాని చుట్టూ ఎలాంటి రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు కల్పించుకుని వెంటనే విద్యుత్ ట్రాన్స్‌ఫారం చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.