ఊపంతా ఉప సర్పంచ్ వైపే.!

ఊపంతా ఉప సర్పంచ్ వైపే.!

SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రెండ్ మారింది. గ్రామాలల్లో సర్పంచ్ పదవి కంటే ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ పెరిగింది. రిజర్వేషన్లు తమకు అనుకూలించకపోవడంతో చక్రం తిప్పాలనుకున్న నాయకులు వార్డు సభ్యునిగా పోటీ చేసి ఉప సర్పంచ్ అవ్వాలని చూస్తున్నారు. దీని ద్వారా పరోక్షంగా గ్రామ పాలనపై పట్టు సాధించాలని భావిస్తున్నారు. దీంతో సర్పంచ్ కంటే ఇప్పుడు ఉప సర్పంచ్‌కు భారీగా పోటీ పెరుగుతోంది.