ఇకపై శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి

ఇకపై శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి

శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్‌కోర్ బోర్డు షాక్ ఇచ్చింది. ఇకపై వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే భక్తులు రూ.5 చొప్పున వెల్పేర్ ఫండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు మండల, మకరవిళక్కు సీజన్‌కు సంబంధించి రూ.5 వెల్పేర్ ఫండ్ చెల్లిస్తేనే స్లాట్ బుక్ అవుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు యాత్రికులకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.