మంగళగిరిలో ఏటీఎం మోసం

GNTR: మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నగదు డ్రా చేయాలనుకొని వచ్చిన నిడమర్రు వాసి మణికుమార్ రూ.57 వేలు మోసపోయాడు. అతడి పిన్ నెంబర్ గమనించిన ఓ వ్యక్తి బ్యాంక్ సిబ్బందిగా నటించి మాట్లాడాడు. కార్డు మార్పు చేసి అసలైన కార్డు దొంగిలించాడు. తర్వాత వరుసగా ఆరుసార్లు డబ్బులు డ్రా చేశాడు. మోసం గుర్తించిన మణికుమార్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.