ఉగ్రవాదులకు ఉరిశిక్ష.. ఇజ్రాయెల్ కొత్త చట్టం
పాలస్తీనీయులు ఉగ్రదాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కీలక నిర్ణయంపై అమెరికా స్పందిస్తూ.. తన దేశం కోసం సొంత చట్టాలను రూపొందించుకునే సర్వాధికారాలు ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఉన్నాయని మద్దతు తెలిపింది. కాగా, ఈ కఠిన చట్టం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.