నేడే జాతీయ లోక్ అదాలత్
SKLM: జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ఇవాళ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం తెలిపారు. జిల్లాలో 11,602 కేసులను గుర్తించగా, పరిష్కారానికి 20 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో నాలుగు బెంచ్‌లు పని చేయనున్నాయి. సివిల్, క్రిమినల్ కంపౌండ బుల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.