సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన హజ్ యాత్రికులు

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన హజ్ యాత్రికులు

NTR: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకున్న హజ్ యాత్రికులకు రాయితీ ఇవ్వడం పట్ల CM చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం విజయవాడలో మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ను కలిసి థ్యాంక్ యు ప్లకార్డులు చూపుతూ అభినందించారు. 24 గంటల్లో బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడాన్ని వారు హర్షించారు. 2026 హజ్‌కి కూడా ఈ రాయితీ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.