'నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా నిర్వహించాలి'

'నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా నిర్వహించాలి'

NLG: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మర్రిగూడ మండలం, సరంపేట, శివన్న గూడెం, వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ, సిబ్బంది హాజరు, నామినేషన్ రుసుము స్వీకరణ వంటి విషయాలను తెలుసుకున్నారు.