ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
SRD: కృష్ణాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రాథమిక పాఠశాల టీచర్స్ ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పథకాలను వినియోగించుకోవాలని కోరారు.