అలర్ట్.. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

అలర్ట్.. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

సత్యసాయి: రాష్ట్రంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.