మెస్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల ధర్నా
SDPT: హాస్టల్లో మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. కళాశాల ముందే ధర్నా నిర్వహించిన విద్యార్థులు.. అడ్మిషన్ల సమయంలో ఇచ్చిన హామీని అధికారులు విస్మరించారని మండిపడ్డారు. మెస్ ఉంటుందనే నమ్మకంతోనే తాము ఇక్కడ చేరామని, ఇప్పుడు భోజన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.