రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

SRPT: యూరియా కోసం వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి యువకుడు బలయ్యాడు. ఈ ఘటన నాగారం మండలం తిరుమలగిరి శివారులో సూర్యాపేట రోడ్డుపై ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మాచిరెడ్డిపల్లెకి చెందిన వద్దే కృష్ణ (25)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి అంజమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.