పార్కులో నెలకొన్న సమస్యలకు త్వరలో చెక్
PPM: పట్టణంలోని డాక్టరు సన్యాసిరాజు మున్సిపల్ పార్కులో ఉన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి. పావని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన పరిసరాలకు తుప్పు కంటి పాపలకు ముప్పు అనే వార్తకు ఆమె పై విధంగా స్పందించారు. ముఖ్యంగా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు.