ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
ATP: రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బైపాస్ రోడ్డు రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు లోకేషన్ ట్రేస్ చేసి అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.