'ఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకోవాలి'
MDK: గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట ఎంపీడీవో షాకీర్ హలీ పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులపై గ్రామస్తులతో చర్చించి తీర్మానాలను చేశారు.