డిసెంబర్ నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం
ATP: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రసాద్ బాబు గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రం, లేదా ఆన్లైన్ పేమెంట్ గెట్ వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని వివరించారు.