VIDEO: మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

NZB: చందూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించారు. మండల అధ్యక్షులు దాకటి సాయిలు మాట్లాడుతూ.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జాతి కోసం ప్రాణాలను కోల్పోయిన మాదిగ సోదరులను ఎన్నటికీ మరువలేమన్నారు.