5న పాలిటెక్నిక్ ఓపెన్ అడ్మిషన్లు

5న పాలిటెక్నిక్ ఓపెన్ అడ్మిషన్లు

CTR: పలమనేరు సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 5న పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఓపెన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ స్రవంతి తెలిపారు. ఏపీ పాలిసెట్ రాసి సీట్ పొందని వారు, పాలిసెట్ రాయకున్నా పదో తరగతి పాసైన వారు ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలన్నారు.