మార్కాపురం ఘటన.. స్వగ్రామానికి మృతదేహాలు

మార్కాపురం ఘటన.. స్వగ్రామానికి మృతదేహాలు

మార్కాపురం మండలం రాయవరం వద్ద ప్రైవేటు బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను గుర్తించిన అధికారులు కుటుంబాలకు అప్పగించారు. ఈ క్రమంలో చోడవరం గ్రామానికి చెందిన మహేంద్ర మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ కన్నీటి రోదనలు అక్కడి వారి హృదయాలను కలిచివేశాయి.