VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

RR: మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలోని నిరుపేద మహిళ రమాదేవి ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో ఈరోజు దగ్ధమైంది. గతంలో భర్త చనిపోవడంతో, కూలి పని చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్న రమాదేవి తన ఇంట్లో అన్ని వస్తువులను కోల్పోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరుతోంది.