తిరుమలలో పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు

తిరుమలలో పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు

AP: తిరుమల పర్యావరణ పరిరక్షణపై టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పాత డీజిల్, పెట్రెల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా తిరుపతి-తిరుమల మధ్య పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తిరుమలలో ఇప్పటికే విద్యుత్ బస్సులు ప్రారంభమైన విషయం తెలిసిందే.