అన్నదాత పోరు పోస్టర్లు ఆవిష్కరణ

అన్నదాత పోరు పోస్టర్లు ఆవిష్కరణ

GNTR: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని గుంటూరు వైసీపీ అధ్యక్షురాలు నూరీ ఫాతిమా అన్నారు. వ్యవసాయ సీజన్‌లో యూరియా అందించకపోగా రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈమేరకు ఈనెల 9న జరుగనున్న అన్నదాత పోరు పోస్టర్లను ఆదివారం తన కార్యాలయంలో విడుదల చేశారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.