అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. అస్వస్థతకు గురైన చిన్నారి
VKB: అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంతో హస్నాబాద్‌కు చెందిన చిన్నారి కృతి నైనా అస్వస్థతకు గురైంది. హస్నాబాద్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి రోజు మాదిరిగా వెళ్లిన తన కూతురు కేంద్రంలో అజాగ్రత్తగా పడేసిన ప్యారాసిటమాల్ టాబ్లెట్లు మింగిందని తండ్రి సాయికుమార్ వాపోయాడు. సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు.