"సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలి"

NLG: పల్లెల్లోని సమస్యల పరిష్కారానికి పాలకులు శ్రద్ధ చూపాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మండలంలోని నర్మెట గ్రామంలో "ఇంటింటికి సీపీఎం కార్యక్రమం" లో భాగంగా సీపీఎం బృందం ఆదివారం గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. నర్మెట నుంచి బంగారిగడ్డకు వెళ్లే రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేశారు.