ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన

బాపట్లలో ప్లాస్టిక్ నిర్మూలనపై చర్యలు తీసుకుంటున్నారు. శనివారం కలెక్టర్ వెంకట మురళి ఆధ్వర్యంలో రైలుపేట డంపింగ్ యార్డు వద్ద నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి మనుగడకే ప్రమాదం కలిగించేందుకు కారణమవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎమ్మెల్యే నరేంద్ర పాల్గొన్నారు.